మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 16:02:00

గ్రౌండ్‌లో నిల‌బ‌డ‌కుండానే బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు.. ఇలా కూడా ఆడుతారా!

గ్రౌండ్‌లో నిల‌బ‌డ‌కుండానే బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు.. ఇలా కూడా ఆడుతారా!

బాస్కెట్ బాల్ అంటే గ్రౌండ్ ఉండాలి. నెట్, బాల్ ఉండాలి. ఆడేందుకు ప్లేయ‌ర్స్ ఉండాలి. వీరంతా గ్రౌండ్‌లోకి దిగితే ఆట ఎంత ర‌స‌వ‌త్తంగా సాగుతుందో తెలిసిందే. కానీ ఈ ఆట‌లో మాత్రం ప్లేయ‌ర్స్ ఉన్నారు, గ్రౌండ్ ఉంది, బాల్ ఉంది, కానీ ప్లేయ‌ర్స్ మాత్రం ఒక‌చోట లేరు. ఒక అమ్మాయి గ్రౌండ్‌లో ఉండి బాల్ అందిస్తుంటే మిగిలిన వారంద‌రూ ఒక్కో ఇంటి మీద నిల‌బ‌డి గోల్ వేస్తున్నారు.

అంత‌దూరం నుంచి కూడా గోల్ వేయ‌డంతో అంద‌రూ ఫిదా అవుతున్నారు. 27 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను శ్యామ్ బోవ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. "నేను క్విన్టుప్లెట్. నా తోబుట్టువులు, నేను అందరూ బాస్కెట్‌బాల్ ఆడుతూ పెరిగాము" అని సామ్ బోవా శీర్షికలో పోర్కొన్నారు. ఈ వీడియోకు ల‌క్ష‌కు పైగా లైకులు వ‌చ్చాయి. 'అమేజింగ్‌! అంత పెద్ద కుటుంబం ఎలా ఉంటుందో ఊహించ‌లేము' అని ఒక వినియోగ‌దారుడు కామెంట్ చేశారు. 

 


logo