శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 18:05:17

క్వారంటైన్ 14 రోజుల నుంచి 28 రోజుల‌కు పెంపు

క్వారంటైన్ 14 రోజుల నుంచి 28 రోజుల‌కు పెంపు

భువ‌నేశ్వ‌ర్ : క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టివ‌ర‌కు విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఒడిశా ప్ర‌భుత్వం ఈ క్వారంటైన్ కాలాన్ని 14 రోజుల నుంచి 28 రోజుల‌కు పెంచింది.

ఈ పీరియ‌డ్‌లో 21 రోజులు సంస్థాగ‌త క్వారంటైన్ (ఇనిస్టిట్యూష‌న‌ల్ క్వారంట‌న్), 7 రోజులు హోం క్వారంటైన్ గా నిర్ణ‌యించింది. విదేశాల నుంచి ఒడిశాకు వ‌చ్చిన ప్రతీ ఒక్క‌రూ ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే.  కోవిడ్‌-19 (క‌రోనా వైర‌స్‌)ఇంక్యుబేష‌న్ పీరియ‌డ్ 28 రోజులు కావ‌డంతో ఒడిశా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo