శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 11:32:32

టెంకాయ చెట్టుకు ఊపిరిరాడ‌కుండా చుట్టేసిన కొండ‌చిలువ : వీడియో వైర‌ల్‌

టెంకాయ చెట్టుకు ఊపిరిరాడ‌కుండా చుట్టేసిన కొండ‌చిలువ :  వీడియో వైర‌ల్‌

కొండ‌చిలువ‌ను సోష‌ల్ మీడియాలో చూస్తేనే హ‌డ‌లిపోతుంటాం. డైరెక్టుగా చూస్తే గుండె ఆగిపోతుందేమో. ఎదురుగా ఏదైనా క‌నిపిస్తే అమాంతం మింగేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుందే త‌ప్పా పాపం వ‌దిలేద్దాం అనుకోదు. 18 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో కొండ‌చిలువ, ప్రాణం ఉన్న జంతువు అనుకున్న‌దో ఏమో టెంకాయ చెట్టు ఎక్కి అమాంతం చుట్టేసుకున్న‌ది.

"పైథాన్ ఒక తాటి చెట్టు వెంట జారిపోతోంది. గొప్ప మెరుగుదల'‌ అనే శీర్షిక‌తో ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా. ఈ సంఘ‌ట‌న‌ను అక్క‌డున్న వారు కొంత‌మంది వీడియో తీసిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను 15 వేల‌కు పైగా వీక్షించారు. ఈ వీడియో చూడ్డానికి భ‌యంగా ఉంది. 'లోకోమోషన్ అద్భుతం' అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


    


logo