ఆదివారం 24 జనవరి 2021
National - Dec 26, 2020 , 16:20:30

జనవరి 3 నుంచి పూరి జగన్నాథస్వామి దర్శనం.. నిబంధనలు ఇవే..

జనవరి 3 నుంచి పూరి జగన్నాథస్వామి దర్శనం.. నిబంధనలు ఇవే..

పూరి : కరోనా నేపథ్యంలో తొమ్మిది నెలలుగా మూతపడిన పూరి జగన్నాథస్వామి ఆలయం ఇటీవల తెరచుకుంది. శనివారం ఉదయం నుంచి స్థానిక భక్తులను మాత్రమే ఆలయ దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. ఈ నెల 31 వరకు వార్డుల వారీగా భక్తుల ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు పరిశీలించి అనుమతిస్తామని జిల్లా పాలనా యంత్రాంగం తెలిపింది.

జనవరి 3 నుంచి దేశవ్యాప్తంగా భక్తులను ఆలయ దర్శనానికి అనుమతిస్తామని,  నాలుగు రోజులకు ముందు కరోనా పరీక్ష చేయించుకొని నెగటివ్‌ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. 65 ఏండ్ల పైబడిన వారిని 10 ఏండ్లలోపు పిల్లలను ఆలయ పరిసరాల్లోకి అనుమతించబోమని పేర్కొ్ంది.  చాలారోజుల తరువాత ఆలయం తెరుచుకోవడంతో స్థానికులు జగన్నాథస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. కరోనా ఉధృతి కారణంగా మార్చి నుంచి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo