ఆదివారం 17 జనవరి 2021
National - Dec 05, 2020 , 11:13:23

రైతులకు సంఘీభావంగా అవార్డును తిరస్కరించిన పంజాబీ సింగర్‌

రైతులకు సంఘీభావంగా అవార్డును తిరస్కరించిన పంజాబీ సింగర్‌

ఛండీగఢ్‌ : కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు పంజాబీ గాయకుడు హర్భజన్‌ మన్‌ మద్దతు తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించిన పంజాబీ ప్రభుత్వ ‘శిరోమణి పంజాబీ’ అవార్డును అంగీకరించబోనని స్పష్టం ప్రకటించారు. అవార్డుకు పంజాబీ భాషా విభాగం గురువారం హర్భజన్‌ పేరును ఎంపిక చేసింది. సాహిత్యం, కళలు, తదితర 18 విభాగాల్లో ప్రతిభ కబరిచిన వ్యక్తులకు సాహిత్య రత్న, శిరోమణి అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. అవార్డుకు తన పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అవార్డును తాను అంగీకరించలేనని, ప్రజల ప్రేమే నా కెరీర్‌లో అత్యుత్తమ పెద్ద అవార్డు అనీ, ప్రస్తుతం మనం అందరం రైతుల శాంతియుత నిరసనకు మద్దతు ఇవ్వాలన్నారు. హర్భజన్‌ గతకొద్ది రోజులుగా పంజాబీ గాయకులు, కళాకారులతో కలిసి రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసనలోనూ పాల్గొన్నాడు. ఇంతకు ముందు కన్వర్ గ్రెవాల్, సిద్ధూ మూస్వాలా, బబ్బూ మాన్, హర్ఫ్ చీమాతో సహా పలువురు పంజాబీ గాయకులు రైతులకు సంఘీభావం ప్రకటించారు.