గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 02:29:42

60 ఏండ్ల నుంచి 58కి..

 60 ఏండ్ల నుంచి 58కి..
  • పదవీ విరమణ వయసును తగ్గించిన పంజాబ్‌

చండీగఢ్‌: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గిస్తున్నట్టు పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగులు 60 ఏండ్లకు పదవీ విరమణ చేస్తుండగా.. దాన్ని రెండేండ్లకు కుదించి 58 గా చేస్తున్నట్టు పేర్కొన్నది. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,54,805 కోట్ల మొత్తానికి బడ్జెట్‌ అంచనాలను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. 12వ తరగతి వరకు అందరికి ఉచితవిద్యను అందివ్వాలన్న మరో సంచలన నిర్ణయం ప్రకటించింది. కౌలురైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన హామీ అయిన 10లక్షల మందికి స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఏప్రిల్‌లో ఈ పంపిణీ చేపడుతామని మంత్రి చెప్పారు.


logo