బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 02:46:05

పబ్‌జీలో 16 లక్షలు గాయబ్‌

పబ్‌జీలో 16 లక్షలు గాయబ్‌

  • తండ్రి మందుల డబ్బులు పోగొట్టిన బాలుడు

చండీగఢ్‌, జూలై 4: పబ్‌జీ గేమ్‌ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేంది. పంజాబ్‌కు చెందిన 17 ఏండ్ల వయసున్న ఓ బాలుడు ఈ ఆటలో భాగంగా రూ.16 లక్షలు ఖర్చుపెట్టాడు. ఇటీవల లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉన్న ఆ బాలుడు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ఉన్నాయని చెప్పి తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లను తీసుకున్నాడు. తర్వాత పబ్‌జీ గేమ్‌ ఆడటం మొదలుపెట్టాడు. ఆటలో భాగంగా ఫిరంగులు, టోర్నమెంట్‌ పాస్‌లు తదితరాలను కొనుగోలు చేశాడు. ఆ స్మార్ట్‌ఫోన్లలో తల్లిదండ్రుల బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు, ఏటీఎం కార్డుల వివరాలు ఉండటంతో కొనుగోలు చేసిన వాటికి డబ్బులు కట్‌ అయ్యాయి. ఇలా నెల రోజుల వ్యవధిలో ఆ బాలుడు రూ.16 లక్షలు ఖర్చు చేశాడు. తన వైద్యం కోసం దాచిన డబ్బులను కుమారుడు ఖర్చు చేసినట్లు తెలిసిన తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతడికి బుద్ధిచెప్పాలనుకున్న ఆయన స్కూటర్‌ రిపేర్‌ దుకాణంలో పనికిపెట్టాడు.

తాజావార్తలు


logo