గురువారం 04 జూన్ 2020
National - May 07, 2020 , 20:10:32

ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసిన పంజాబ్ విద్యార్థులు

ప్రపంచ రికార్డునే బ్రేక్ చేసిన పంజాబ్ విద్యార్థులు

పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన  'అంబాసిడర్స్ ఆఫ్ హోప్ ఆన్‌లైన్ వీడియో పోటీల‌కు మొద‌టి వారంలోనే  1,05,898 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇలా మునుపెన్నడూ జ‌రుగ‌లేదు. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. లాక్‌డౌన్‌లో విద్యార్థుల‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో ఏప్రిల్ 29న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజ‌య్ ఇంద‌ర్ సింగ్లా ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న విద్యార్థుల గురించి సింగ్లా ట్వీట్ చేశారు. క‌రోనా వైర‌స్ గురంచి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి చాలామంది పిల్లలు త‌మ వీడియోల‌ను సృజనాత్మక సందేశాలతో ప్రభుత్వానికి పంపారు. కొంద‌రు పాట‌లు పాడ‌గా.. మ‌రికొంద‌రు ప‌ద్యాలు చెప్పారు. న‌ట‌న ఇష్టమున్నవాళ్లు స్కిట్లు చేశారు.

పిల్లలు త‌మ వీడియోల‌ను #AmmbassdorsofHope అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్యాగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వంతోపాటు పంజాబ్‌లోని ప్రతి ఒక్కరూ చేస్తార‌ని సింగ్లా తెలిపారు. ఈ పోటీలో ప్రభుత్వ‌, ప్రైవేట్ పాఠ‌శాల‌ల పిల్లలు ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు అని తెలిపారు. ' ప్రభుత్వ పాఠ‌శాల పిల్లలను రేడియో, టెలివిజ‌న్‌కు అల‌వాటు చేలన్నదే దీని ముఖ్య ఉద్దేశం అని సింగ్లా చెప్పుకొచ్చారు. కోవిడ్ -19 కారణంగా విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండటానికి రాష్ట్రం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోందని సింగ్లా అభిప్రాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో 19,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించక ముందే 5,550 పాఠశాలలను అన్ని సౌకర్యాలతో "స్మార్ట్ పాఠశాలలు" గా మార్చారని మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మిగిలిన పాఠశాలలను కూడా స్మార్ట్ పాఠశాలలుగా మారుస్తామని ఆయన చెప్పారు.


logo