మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 13:15:21

కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా పంజాబ్ ఎమ్మెల్యేల మార్చ్‌.. వీడియో‌‌

కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా పంజాబ్ ఎమ్మెల్యేల మార్చ్‌.. వీడియో‌‌

న్యూఢిల్లీ: నరేంద్ర‌మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్ర‌భుత్వం తీరుపై పంజాబ్ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. అన్ని విష‌యాల్లో పంజాబ్‌పై కేంద్రం వివ‌క్ష చూపుతున్న‌ద‌ని వారు మండిప‌డుతున్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిరసిస్తూ ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద‌ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాల‌ని వారు నిర్ణ‌యించారు. అందులో భాగంగా పంజాబ్‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు బుధ‌వారం ఉద‌యం ఢిల్లీలోని పంజాబ్ భ‌వ‌న్ నుంచి జంత‌ర్‌మంత‌ర్ వ‌ర‌కు కాలినడ‌క‌న వెళ్లారు. 

పంజాబ్ ఎమ్మెల్యేల ఆందోళ‌న నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు అవ‌కాశం లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముఖ్యంగా పంజాబ్‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా ఉండ‌టంలేద‌ని, విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞ‌ప్తి చేసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఎమ్మెల్యేలు ఆరోపించారు. గూడ్స్ రైళ్ల‌కు కేంద్రం అనుమ‌తించ‌కపోవ‌డంతో రాష్ట్రంలో అత్య‌వ‌స‌రాల స‌ర‌ఫ‌రాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని చెప్పారు.

         

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.