గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 19:02:13

ఆయనొస్తే క్యాబినెట్‌ మీటింగ్‌కు మేం రాం

ఆయనొస్తే క్యాబినెట్‌ మీటింగ్‌కు మేం రాం

చండీగఢ్‌‌: పంజాబ్‌లో మంత్రులకు చీఫ్‌ సెక్రటరీ మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను హెచ్చరించే వరకు వెళ్లింది. క్యాబినెట్‌ మీటింగ్‌కు ఆయనొస్తే మేం రాం అని కరాఖండిగా  మంత్రులు చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీ క్యాబినెట్‌ మీటింగ్‌ నుంచి ఆర్థికశాఖమంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్‌ వాకవుట్‌ చేశారంటే పరిస్ధితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. 

ఎక్సైజ్‌ పాలసీపై చర్చించేందుకు శనివారం ప్రీక్యాబినెట్‌ ఏర్పాటుచేయగా.. సీఎస్‌ కరణ్‌ అవతార్‌ సింగ్‌ ఒకరిద్దరు మంత్రులు చేసిన సిఫార్సులను తప్పుబట్టారు. దాంతో సీఎస్‌ను తొలగించాల్సిందే అని మంత్రులు పట్టుబట్టారు. ఫలితంగా శనివారం జరుగాల్సిన క్యాబినెట్‌ మీటింగ్‌ను సోమవారానికి పోస్ట్‌పోన్‌ చేశారు. సీఎస్‌ను తొలగించేవరకు క్యాబినెట్‌ సమావేశానికి రామని, ఆయన హాజరైతే మేం గైర్హాజరవుతామని  సీఎంకు పలువురు మంత్రులు స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్‌ సమావేశానికి సీఎస్‌ను దూరంగా  ఉండాలని, హోంశాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్రను ఆయన బాధ్యతలు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. 


logo