మంగళవారం 31 మార్చి 2020
National - Mar 17, 2020 , 01:21:19

లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం

లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
  • పంజాబ్‌ సీఎం హామీ

చండీగఢ్‌: వచ్చే రెండేండ్లలో యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ హామీ ఇచ్చా రు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడి సోమవారంతో మూడేైండ్లెన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 12.17 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు రూట్లలో చిన్న బస్సుల కోసం ఐదు వేల కొత్త పర్మిట్లు, రవాణాకు సంబంధించి రెండు వేల పర్మిట్లు ఇస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించడంతోపాటు ప్రజల ఆరోగ్యం, యువతలో ఫిట్‌నెస్‌ కోసం 750 గ్రామీణ క్రీడా స్టేడియాలు నిర్మిస్తామని అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. 


logo
>>>>>>