బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 13:06:38

కరోనా వైరస్‌పై అవగాహన కోసం.. కోవా పంజాబ్‌ యాప్‌..

కరోనా వైరస్‌పై అవగాహన కోసం.. కోవా పంజాబ్‌ యాప్‌..

కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పంజాబ్‌ ప్రభుత్వం తాజాగా కోవా పంజాబ్‌ (COVA Punjab) పేరిట ఓ నూతన మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. COVA అంటే Corona Virus Alert అని అర్థం వస్తుంది. ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు, ఆ వైరస్‌ బారిన పడకుండా వారికి తగిన జాగ్రత్తలను తెలియజేసేందుకే ఈ యాప్‌ను లాంచ్‌ చేశామని పంజాబ్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ వినీ మహాజన్‌ వెల్లడించారు. 

కోవా పంజాబ్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉందని, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. కరోనా వైరస్‌ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, అలాగే ఆ వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవచ్చని వినీ మహాజన్‌ తెలిపారు. ఇక యాప్‌లో ప్రజలు తమకు సమీపంలో ఉన్న హాస్పిటల్‌ లేదా జిల్లా నోడల్‌ అధికారి వివరాలు తెలుసుకోవచ్చని, దీంతో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారు అప్రమత్తమై హాస్పిటల్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 


logo