బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 11:07:10

5 ల‌క్ష‌ల ఖ‌రీదైన‌ చెరుకు పంట‌ను త‌గ‌ల‌బెట్టిన రైతు

5 ల‌క్ష‌ల ఖ‌రీదైన‌ చెరుకు పంట‌ను త‌గ‌ల‌బెట్టిన రైతు

హైద‌రాబాద్‌: పంజాబ్‌లో చెరుకు రైతుల‌ది దీన ప‌రిస్థితి.  వారి పంట‌ను కొనేవాళ్లే లేరు.  ఫ‌రీద్‌కోట్‌లోని ఓ రైతు త‌న చెరుకు పంట‌ను దిక్కుతోచ‌న ప‌రిస్థితిలో త‌గ‌ల‌బెట్టేశాడు.  సుమారు 5 ల‌క్ష‌ల ఖ‌రీదైన చెరుకు పంట మంటల్లో కాలి బూడిదైంది. జ‌గ్తార్ సింగ్ అనే చెరుకు రైతు.. సాధార‌ణంగా త‌న పంట‌ను చిన్న‌పాటి జ్యూస్ సెల్ల‌ర్ల‌కు అమ్ముతుంటాడు. లాక్‌డౌన్ వ‌ల్ల జ్యూస్ అమ్మేవాళ్లు షాపులు తెర‌వ‌డం లేదు.  షుగ‌ర్ మిల్లులు కూడా బంద్ అయ్యాయి. దీంతో ఆ రైతు పంట అలాగే ఉండిపోయింది.  ఇక చేసేది ఏమీలేక .. రెండు ఎక‌రాల్లోని చెరుకు పంట‌కు నిప్పుపెట్టేశాడు.

  

తాజావార్తలు


logo