శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 21:38:14

ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్‌ నడిపిన రైతు

ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్‌ నడిపిన రైతు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రైతులు జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో లక్షలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో పాల్గొనేందుకు పంజాబ్‌, హర్యానాతోపాటు ఢిల్లీ పరిసర రాష్ట్రాల నుంచి రైతులు తమ ట్రాక్టర్లతో దేశ రాజధానికి బయలుదేరుతున్నారు. 

కాగా, పంజాబ్‌కు చెందిన ఓ రైతు వినూత్నంగా పంజాబ్‌ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్‌ను రివర్స్‌ గేర్‌లో నడిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ ఇదే విధంగా వెనక్కి తీసుకోవాలని ఆ రైతు డిమాండ్‌ చేశారు. రైతుల సందేశాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకే పంజాబ్‌ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్‌ను రివర్స్‌లో నడిపినట్లు తెలిపారు. 

కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo