e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home జాతీయం 23న పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు

23న పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు

23న పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా ఇటీవల నియమితులైన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఈ నెల 23న ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం అమరీందర్‌ సింగ్‌ను ఆయన ఆహ్వానించారు. 65 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఆహ్వాన పత్రాన్ని సీఎంకు పంపారు. పంజాబ్‌ కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్‌ రావత్‌న్‌ కూడా ఈ కార్యక్రమానికి సిద్ధూ ఆహ్వానించారు.

కాగా, సీఎం అమరేందర్‌ సింగ్‌పై సామాజిక మాధ్యమాల్లో అవమానించిన సిద్ధూ క్షమాపణ చెప్పనిదే సీఎం ఆయనను కలువరని సీఎం మీడియా సలహాదారుడు రవీన్ తుక్రా మంగళవారం ట్వీట్‌ చేశారు. సీఎంను కలిసేందుకు సిద్ధూ సమయం కోరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమయం కేటాయించలేదన్న ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో తనకు మద్దతిచ్చిన 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్‌సర్‌లోని తన నివాసంలో సిద్ధూ బుధవారం అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతోపాటు పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా సిద్ధూ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సమస్యలు తీర్చని సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
23న పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు
23న పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు
23న పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు

ట్రెండింగ్‌

Advertisement