ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 17:06:43

12వ తరగతి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు.. పథకం ప్రారంభించిన సీఎం

12వ తరగతి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు.. పథకం ప్రారంభించిన సీఎం

చండీగఢ్: 12వ తరగతి విద్యార్థులకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందజేసే ‘పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్‌’ను ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 12వ తరగతికి చెందిన ఆరుగురు విద్యార్థులకు ఆయన స్వయంగా స్మార్ట్ మొబైల్ ఫోన్లను అందజేశారు. కరోనా నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆ రాష్ట్రంలో 12వ తరగతి చదువుతున్న 1,74,015 మంది విద్యార్థులకు నవంబర్ నాటికి స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఉచితంగా అందజేస్తారు. ఈ పథకం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు వ్యయం చేస్తున్నది.


logo