బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 13:30:02

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సీఎం ధర్నా

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సీఎం ధర్నా

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ధర్నాలో పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఖాట్కర్ కలాన్‌లోని షాహీద్ భగత్ సింగ్ నగర్‌లోని విగ్రహానికి సోమవారం ఉదయం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పారు. న్యాయ, వ్యవసాయ నిఫుణులను సంప్రదించి రాష్ట్ర రైతు చట్టాలను ఆ మేరకు సవరణ చేస్తామని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్‌లో జరుగుతున్న రైతుల నిరసనలో పాల్గొంటారని సమాచారం. అనంతరం ఆయన హర్యానాకు వెళ్లి అక్కడి రైతులతో కలిసి నిరసన తెలుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు నెలలపాటు ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల పిలుపునిచ్చింది. అలాగే ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాలు సేకరిస్తున్నది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo