గురువారం 04 మార్చి 2021
National - Sep 28, 2020 , 14:53:36

రైతులను ఐఎస్ఐ టార్గెట్ చేస్తుంది: సీఎం అమ‌రీంద‌ర్‌

రైతులను ఐఎస్ఐ టార్గెట్ చేస్తుంది: సీఎం అమ‌రీంద‌ర్‌

హైద‌రాబాద్‌:  భార‌తీయ రైతుల నిర‌స‌న‌ల‌ను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ అన్నారు.  వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న రైతుల‌కు అండ‌గా ఆయ‌న ఇవాళ ధ‌ర్నాలో కూర్చుకున్నారు. అగ్రి బిల్లుల‌ అంశంలో తమ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  గ‌త మూడేళ్ల‌లో పంజాబ్‌లో 150 మంది ఉగ్ర‌వాదుల‌ను అణిచివేశామ‌ని, రాష్ట్రం అంతా ప్ర‌శాంతంగా ఉంద‌ని, కానీ నోటి ద‌గ్గ‌ర తిండిని లాక్కుంటే, మీకు ఆగ్ర‌హం రాదా అని అమ‌రీంద‌ర్ ప్ర‌శ్నించారు.  నిర‌స‌న చేస్తున్న రైతులంతా పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐకు టార్గెట్‌గా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు సీఎం ఆరోపించారు. అగ్రి బిల్లుల‌తో ప్ర‌భుత్వం దేశ వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు విమ‌ర్శించారు.  కేంద్రానికి వ్య‌వ‌సాయం అంటే ఏంటో తెలియ‌ద‌ని, అందుకే రైతు నిర‌స‌న‌ల‌ను అర్థం చేసుకోవ‌డం లేద‌న్నారు.  పేద పంజాబీ రైతులు దేశానికి అన్నం పెడుతున్నార‌ని,  ప్ర‌తి ఒక్క‌రికీ ఆహారం అందించే బాధ్య‌త కేంద్రం తీసుకుంటుందా అని ఆయ‌న ప్రశ్నించారు.   


VIDEOS

logo