సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 14:19:41

పుణెలో రికార్డు.. ఒకే రోజు 66 మంది మృతి

పుణెలో రికార్డు.. ఒకే రోజు 66 మంది మృతి

ముంబై : దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ర్ట ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఆ రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. రాష్ర్ట రాజ‌ధాని ముంబైతో పాటు పుణె కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారాయి. ఆ ప్రాంతాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నాయి. మ‌ర‌ణాలు కూడా అదే స్థాయిలో సంభ‌విస్తున్నాయి.  

పుణెలో కొవిడ్ విల‌య‌తాండ‌వానికి స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధ‌వారం ఒక్క‌రోజే 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుల్లో తొమ్మిది నెల‌ల చిన్నారి కూడా ఉంది. దీంతో పుణెలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 1800ల‌కు చేరింది. 

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,613 కేసులు న‌మోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 78,013కు చేరిన‌ట్లు పుణె వైద్యాధికారులు వెల్ల‌డించారు. పుణె మున్సిపల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో 1,308 కేసులు, పింపిరి చించ్వాడ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో 1,022, కంటోన్మెంట్ ఏరియాల్లో 283 కేసులు న‌మోదు అయ్యాయి. పుణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో బుధ‌వారం ఒక్క‌రోజే 5,919 టెస్టులు చేశారు. 


logo