గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 13:04:50

సైకిల్‌పై తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సైకిల్‌పై తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ముంబై: మహారాష్ట్రలోని పూణే పోలీసులు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. సైకిల్‌పై తిరుగుతూ కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నారు. పూణేలోని దత్తావాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ దేవిదాస్ ఘేవేర్ తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో సైకిల్‌పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 నుంచి 14 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని, కొన్ని ప్రాంతాలకు వాహనాలు వెళ్లలేవని చెప్పారు. ప్రస్తుతం తాము అలాంటి చోట్లకు కూడా సైకిల్‌పై వెళ్లగలుగుతున్నామని, కంటైన్‌మెంట్ ప్రాంతాల్లోని కరోనా పరిస్థితులను పరిశీలిస్తున్నామని తెలిపారు.

కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండటానికి వ్యాయామం చాలా ముఖ్యమని దేవిదాస్ చెప్పారు. అయితే విధి నిర్వహణ వల్ల తమకు తగినంత సమయం లభించదని అన్నారు. ప్రస్తుతం సైకిల్‌పై పెట్రోలింగ్ చేస్తుండటంతో ఒకవైపు వ్యాయామం, మరోవైపు ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కలుగుతున్నదని ఆయన తెలిపారు.logo