బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 12:53:41

ప్ర‌తి నెలా పుణెలో ఆచూకీ లేని 400 కోవిడ్ మ‌ర‌ణాలు

ప్ర‌తి నెలా పుణెలో ఆచూకీ లేని 400 కోవిడ్ మ‌ర‌ణాలు

హైద‌రాబాద్‌: పుణెలో సుమారు 400 క‌రోనా మ‌ర‌ణాల ఆచూకీ చిక్క‌డం లేద‌ని ఆ న‌గ‌ర మేయ‌ర్ ముర‌ళీధ‌ర్ మోహుల్ తెలిపారు. జూలైలో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించినవారిలో 400 మంది లెక్క‌లో లేకుండాపోయార‌న్నారు. ఈ విష‌యాన్ని సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పిన‌ట్లు మేయ‌ర్ తెలిపారు. న‌గ‌రంలోని స‌సూన్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో..  క‌రోనా వైర‌స్‌తో మ‌ర‌ణిస్తున్న‌వారిలో.. ప్ర‌తి నెల దాదాపు 400 నుంచి 500 మంది ఆచూకీలేకుండాపోతున్న‌ట్లు మేయ‌ర్ చెప్పారు.  మేయ‌ర్ ముర‌ళీధ‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల ఆధారంగా క‌లెక్ట‌ర్ న‌వ‌ల్ కిశోర్ రామ్ ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. స‌సూన్ హాస్పిట‌ల్ నుంచి నివేదిక కోర‌నున్న‌ట్లు తెలిపారు.


logo