గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 17, 2020 , 22:14:39

పుల్వామా తరహా పేలుడు కుట్రను భగ్నం చేసిన ఆర్మీ

పుల్వామా తరహా పేలుడు కుట్రను భగ్నం చేసిన ఆర్మీ

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో మరో పేలుడు కుట్రను సైనికులు భగ్నం చేశారు. పుల్వామా తరహాలోనే సైన్యాన్ని  లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాలని ప్రణాళికలను పసిగట్టిన సైన్యం.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. గత ఏడాది సైనికుల కాన్వాయిపై ఉగ్రవాదులు దాడి జరుపడంతో 40 మందికి పైగా సైనికులు మరణించిన ప్రదేశానికి సమీపంలోనే ప్రస్తుతం పేలుడు పదార్థాలను భూమిలో పాతిపెట్టి ఉంచినట్లు సైనికులు గుర్తించారు.

సైనికాధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు "గడికల్ యొక్క కరేవా ప్రాంతం" వద్ద జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన అక్కడి ఒక పండ్ల తోటలో భూమిలో పాతిపెట్టిన సింటెక్స్ ట్యాంక్ ను గుర్తించారు. ఈ సింటెక్స్ ట్యాంకులో సుమారు 52 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఒక్కొక్కటి 125 గ్రాములతో 416 ప్యాకెట్ల పేలుడు పదార్థాలు ఉన్నాయి. సమీపంలో కూడా శోధించగా మరో ట్యాంకులో 50 డిటోనేటర్లు ఉన్న విషయాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాన్ని "సూపర్ 90" గా పిలుస్తారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలు దొరికిన ప్రదేశం జాతీయ రహదారికి చాలా దగ్గరగా ఉన్నదని, 2019 పుల్వామా దాడి స్థలం నుండి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. 

గత ఏడాది ఫిబ్రవరి 14 న పేలుడు పదార్థాలతో నిండిన కారును సెక్యూరిటీ కాన్వాయ్‌లోకి దూకించడంతో 40 మంది సైనికులు మరణించారు. ఈ దాడిలో జెలిటిన్ స్టిక్స్ తో పాటు 35 కిలోల ఆర్‌డీఎక్స్ ప్లాస్టిక్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. కొన్ని రోజుల తరువాత పాకిస్తాన్ యొక్క బాలకోట్ లో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని తొలగించడానికి భారత వైమానిక దళం దాడులు జరిపింది. ఒకరోజు తరువాత నియంత్రణ రేఖ వెంబడి వైమానిక యుద్ధం కూడా జరిగింది. ఈ ఘటన భారత్-పాకిస్తాన్లను యుద్ధ అంచుకు తీసుకువెళ్ళాయి. పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన టెర్రర్ మాస్టర్ మైండ్ మసూద్ అజార్, అతడి సోదరుడు రౌఫ్ అస్ఘర్ ముఖ్య కుట్రదారులు అని జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల చార్జిషీట్‌లో పేర్కొన్నది. 13,500 పేజీల చార్జిషీట్‌లో జైష్ ఉగ్రవాదులు మరో దాడి చేయాలని యోచిస్తున్నారని, ఫిదయీ లేదా ఆత్మాహుతి బాంబర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని, అయితే బాలకోట్‌లో భారత వైమానిక దాడుల తర్వాత వారు తమ ప్రయత్నాలను వాయిదా వేసుకున్నారు. 26/11 ఉగ్రవాది మసూద్ అజార్ యొక్క జైష్-ఏ-మహమ్మద్ ఉన్న పాకిస్తాన్ నుంచి కశ్మీర్లో అత్యంత ఘోరమైన ఉగ్ర దాడులకు ప్రణాళికలు, అమలు ఎలా జరిగిందో ఎన్ఐఏ 19 మంది నిందితులతో జాబితా చేసింది.


logo