మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:06:51

పుదుచ్చేరిలో విస్తరిస్తున్న క‌రోనా

పుదుచ్చేరిలో విస్తరిస్తున్న క‌రోనా

చెన్నై: కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా విస్త‌రిస్తున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తిరోజు 100కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా కొత్త‌గా 141 మంది కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ‌టంతో పుదుచ్చేరిలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేల మార్కును దాటి 3,011కు చేరింది. మొత్తం కేసుల‌లో 1782 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మ‌రో 47 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 1182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పుదుచ్చేరి వైద్యారోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కాగా దేశంలో సైతం గ‌త 24 గంట‌ల్లో 47,704 మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. దీంతో దేశ‌వ్యాప్తంగా న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. అందులో 4,96,988 యాక్టివ్ కేసులుండ‌గా, 9,52,744 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, దేశంలో మొత్తం మృతుల సంఖ్య 33,425కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo