శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:13:39

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన స్పీకర్

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన స్పీకర్

చెన్నై: పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ధన‌వేలుపై స్పీకర్ వీపీ శివకొలుందు అనర్హతవేటు వేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాగుర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటించారు. ఎమ్మెల్యే ధనవేలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో అతడిపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

అయితే ఈ ఫిర్యాదు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నదని స్పీకర్ శివకొలుందు చెప్పారు. దీని గురించి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ధనవేలును కోరినప్పటికీ ఆయన తగిన సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాల మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును అనర్హుడిగా ప్రకటించినట్లు స్పీకర్ శివకొలుందు తెలిపారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాగుర్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయ్యిందన్నారు.logo