ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 17:00:11

పుదుచ్చేరిలో ఒకే రోజు 481 కరోనా పాజిటివ్ కేసులు

పుదుచ్చేరిలో ఒకే రోజు 481 కరోనా పాజిటివ్ కేసులు

పుదుచ్చేరి :  కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గడిచిన 24 గంటల్లో 481 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,381కి చేరాయి.  బుధవారం నాటికి పుదుచ్చేరిలో 2,616 యాక్టివ్‌ కేసులు నమోదు కాగా, 96 మంది మరణించారు. కొత్త కేసుల్లో 413 పుదుచ్చేరి రీజియన్‌లో, 67 యానంలో, ఒకటి మహేలో నిర్ధారణ అయ్యాయి. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు మాట్లాడుతూ 1,093 కరోనా పాజిటివ్‌ రోగులు హోం ఐసోలేషన్‌లో ఉండగా, మిగతా వారంతా ఆసుపత్రుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

కొత్త కేసులు దాదాపు రెట్టింపు కాగా, ముఖ్యమంత్రి ఈ సాయంత్రం సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 2,616 మందిలో 2,274 మంది పుదుచ్చేరి రీజియన్‌లో, కరైకాల్ జీహెచ్‌లో  161, యానం జీహె‌చ్‌లో 181 మంది, మహేలో నలుగురు ఉన్నారు. బుధవారం మరో 138 మంది దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. 1,123 నమూనాలను పరీక్షించగా, 481 పాజిటివ్‌గా తేలాయి. మరణాల రేటు 1.5 శాతం, రికవరీ రేటు 57.9 శాతం, కరోనా సంక్రమణ రేటు 38.6 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 49,715 నమూనాలు పరీక్షించగా, వాటిలో 42,371 నమూనాలు నెగిటివ్ వచ్చాయని, 621 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo