శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 21:47:33

పుదుచ్చేరి సీఎం కార్యాలయం మూసివేత

పుదుచ్చేరి సీఎం కార్యాలయం మూసివేత

పాండిచ్చేరి : సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో తక్షణమే కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించినట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి శనివారం తెలిపారు. కార్యాలయంలో శానిటైజేషన్‌ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘నిన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిలో ఒకరికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. నేను వెంటనే ఆఫీస్ను మూసివేయాలని ఆదేశించాను. కనీసం రెండు రోజులు కార్యాలయానికి ఎవరూ రావద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను' అని నారాయణస్వామి చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌కు ఇదే విషయమై సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పుదుచ్చేరిలో ఇప్పటి వరకు 502 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మినిన్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివరించింది.


logo