ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 15:06:07

పాండిచ్చేరిలో సీఎం, స్పీకర్‌ సహా సభ్యులకు కొవి‌డ్‌ పరీక్షలు

పాండిచ్చేరిలో సీఎం, స్పీకర్‌ సహా సభ్యులకు కొవి‌డ్‌ పరీక్షలు

పుదుచ్చేరి : పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, స్పీకర్‌ వీపీ శివకోలుంథు, డిప్యూటీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సోమవారం కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేశారు. కాంగ్రెస్ శాసన సభ్యుడు ఎన్ ఎస్ జయబల్‌కు వైరస్‌ సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయ్యింది. అనంతరం శాసన కాంప్లెక్స్‌, వాచ్‌, వార్డు సిబ్బందికి పరీక్షలు జరిగాయి. 126 మంది నుంచి నమూనాలను సేకరించగా, ఇందులో ఆరుగురికి వైరస్‌ సోకినట్లు తేలగా, మిగతా వారందరికీ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన ఆరుగురిని చికిత్సకు తరలించి, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo