శుక్రవారం 10 జూలై 2020
National - Jun 27, 2020 , 16:17:46

ఉద్యోగికి కరోనా పాజిటివ్‌.. సీఎం కార్యాలయం మూసివేత

ఉద్యోగికి కరోనా పాజిటివ్‌.. సీఎం కార్యాలయం మూసివేత

పుదుచ్చేరి :  స్టాఫ్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో సీఎం కార్యాలయాన్ని మూసివేశారు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. శాసనసభలోని సీఎం కార్యాలయంలో పనిచేసే మల్లీ టాస్కింగ్‌ స్టాప్‌ సభ్యుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో శానిటైజ్‌ చేసిన అనంతరం కార్యాలయాన్ని ఈ ఉదయం మూసివేశారు. అసెంబ్లీ భవనం మొత్తాన్ని శానిటైజ్‌ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. అతడితో సన్నిహితంగా మెలిగిన ఐదుగురు వ్యక్తులను క్వారంటైన్‌ తరలించారు. అత్యవసర పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సీఎం వి.నారాయణస్వామి కొన్ని గంటల అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు.


logo