ఆదివారం 12 జూలై 2020
National - Jun 29, 2020 , 16:51:06

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రికి క‌రోనా నెగిటివ్

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రికి క‌రోనా నెగిటివ్

పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి వీ నారాయ‌ణ‌స్వామి, ఆయ‌న సిబ్బందికి క‌రోనా నెగిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో సీఎంతో పాటు సిబ్బంది, ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌రో ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్ లో సీఎం ఉంటార‌ని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ ఎస్ మోహ‌న్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం సీఎం కార్యాల‌యంలోని ఓ ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. ఆదివారం సీఎంతో పాటు సిబ్బంది అంద‌రికి క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించారు. నారాయ‌ణ‌స్వామితో పాటు 52 మందికి క‌రోనా నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు కుమార్ పేర్కొన్నారు. 

సీఎం కార్యాల‌యం వ‌ద్ద ఉండే 32 మంది భ‌ద్ర‌తా సిబ్బంది కూడా హోంక్వారంటైన్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఓ గ‌న్ మెన్ తండ్రికి ఆదివారం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో భ‌ద్ర‌తా సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు.  


logo