సోమవారం 18 జనవరి 2021
National - Jan 04, 2021 , 01:59:06

డబ్బులు కావాలి.. జబ్బులొద్దు!

డబ్బులు కావాలి.. జబ్బులొద్దు!

2021లో ఆరోగ్యానికే అందలం

80.5% మందిది అదే మాట

వివిధ సర్వేల్లో వెల్లడి 

హైదరాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం లక్ష్యాల్లో ఆరోగ్యానికి, డబ్బు సంపాదకే ఎక్కువ మంది ఓటేశారు. పొదుపు మాటను వినిపించారు.  కొత్త సంవత్సరం అనగానే కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం చాలా మందికి అలవాటు. 2021లో లక్ష్యాలు ఏంటని కొన్ని సంస్థలు చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైఫ్‌ టైమ్‌ సంస్థ సర్వేలో 80.5 శాతం మంది ఆరోగ్యమే భాగ్యమన్నారు. 70.5 మంది డబ్బు సంపాదనే లక్ష్యంగా పేర్కొన్నారు. కరోనా, లాక్‌డౌన్‌ తదితర కారణాల వల్ల శారీరకంగా దెబ్బతిన్నామని ప్రతి ఐదుగురిలో నలుగురు అభిప్రాయపడ్డారు. 

సర్వేలో కొత్త సంవత్సర లక్ష్యాల గురించి.. 

* 34.2%: బరువు తగ్గాలనుకునేవారు

* 22%:కండలు పెంచాలనుకునేవారు 

* 12.5%: మానసిక ఆరోగ్యం పెంచుకోవాలనుకునేవారు 

* 70%: లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం కావడం, పార్కులు, జిమ్‌లు మూసివేయడం, వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళికలు దెబ్బతిన్నాయిన చెప్పినవారు 

* 86%: రోజువారీ వ్యాయామం, వర్కౌట్లకు దూరంగా ఉన్నవారు 

* 30.8%: కరోనాకు ముందుతో పోల్చితే ఎక్కువ గంటలు కూర్చున్నామని చెప్పినవారు (వీరు రోజుకు 8 గంటలకుపైగా కుర్చీలకే పరిమితం అయ్యారట)

* 70.5%: డబ్బు సంపాదించడమే లక్ష్యం అంటున్నవారు 

* సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ముగ్గురు డబ్బు విషయంలో ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. 

* షాపింగ్‌లు తగ్గిస్తామని, అత్యవసరమైతేనే అప్పు తీసుకుంటామని, పార్ట్‌టైం జాబ్‌ వెతుక్కుంటామని, మరికొందరు తమ బాస్‌ల వద్దకు వెళ్లి జీతం పెంచుమని కోరుతామని పేర్కొన్నారు. 

* 47%: 2020 ఆర్థికంగా చాలా కష్టంగా గడిచింది 

* 23%: వేతనాల్లో కోత పడింది 

* 34%: ఇతర మార్గాల ద్వారా ఆర్థికంగా నష్టపోయాం 

* 42%: వైద్యానికి ఖర్చులు పెరిగాయని చెప్తున్నవారు 

* 49%: 2019తో పోల్చితే కుటుంబ ఖర్చులు పెరిగాయంటున్నవారు 

* 38%: అప్పుల నుంచి విముక్తి కావాలనుకునేవారు 

* 33%: అనవసర ఖర్చులు తగ్గించుకుంటాం 

* 33%: షాపింగ్‌లో డిస్కౌంట్లకే ప్రాధాన్యం