బుధవారం 27 మే 2020
National - May 07, 2020 , 15:52:45

విశాఖ దుర్ఘటన: లీకైన స్టెరైన్‌ గ్యాస్‌కు గుజరాత్‌ నుంచి విరుగుడు

విశాఖ దుర్ఘటన: లీకైన స్టెరైన్‌ గ్యాస్‌కు గుజరాత్‌ నుంచి విరుగుడు

అమరావతి: విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి లీకైన స్టెరైన్‌ గ్యాస్‌కు విరుగుడును గుజరాత్‌ నుంచి తెప్పిస్తున్నారు. ైస్టెరెన్‌కు ‘పారా టెర్షియరీ బ్యుటైల్‌ క్యాటెకాల్‌ (పీటీబీసీ) విరుగుడుగా పనిచేస్తుందని ఎల్జీ పాలిమర్స్‌ ప్రతినిధులు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ నుంచి ఆ గ్యాస్‌ నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేసింది.  గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. వ్యాపి నుంచి పీటీబీసీని డామన్‌ ఎయిర్‌పోర్టుకు పంపించాలని ఆదేశించారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వం 500 కేజీల పీటీబీసీని రోడ్డు మార్గం ద్వారా డామన్‌ విమానాశ్రయానికి తరలిస్తున్నది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఈ పీటీబీసీని విశాఖపట్నం తీసుకురానున్నారు. 


logo