ఆదివారం 24 జనవరి 2021
National - Dec 04, 2020 , 12:47:22

సైకో కిల్ల‌ర్ ఎన్‌కౌంట‌ర్‌.. అయిదుగురు పోలీసుల‌కు గాయాలు

సైకో కిల్ల‌ర్ ఎన్‌కౌంట‌ర్‌.. అయిదుగురు పోలీసుల‌కు గాయాలు

హైద‌రాబాద్‌: సైకో కిల్ల‌ర్ దిలీప్ దివాల్‌ను పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ర‌త్లాంలో అత‌న్ని హ‌త‌మార్చారు.  ఈ ఎన్‌కౌంట‌ర్‌లో అయిదుగురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. 38 ఏళ్ల దిలీప్ దివాల్‌ది గుజ‌రాత్‌లోని దాహ‌ద్ స్వంత గ్రామం. ప‌లు రాష్ట్రాల్లో అత‌నిపై ఆరు మ‌ర్డ‌ర్ కేసులు ఉన్నాయి.  ఇటీవ‌ల ర‌త్లాంలో ముగ్గురు స‌భ్యులు ఓ కుటుంబాన్ని అత‌ను హ‌త‌మార్చాడు. దీపావ‌ళి సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఆ ఫ్యామిలీని దిలీప్ చంపేశాడు. జూన్‌లోనూ ఓ మ‌హిళ‌ను హ‌త‌మార్చిన‌ట్లు దివాల్‌పై కేసు ఉన్న‌ది. ర‌త్లాంలో ఓ సెలూన్ వ్య‌క్తి త‌న భూమిని అమ్మి ఇంట్లో ఆ డ‌బ్బును దాచుకున్నాడు. అయితే ఆ వ్య‌క్తి ఇంట్లో డ‌బ్లు ఉన్న‌ట్లు తెలుసుకున్న దిలీప్‌.. అత‌ని ఇంటిపై దాడి చేసి వారిని హ‌త‌మార్చాడు. ఈ కేసులో మ‌రో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు.   


logo