మంగళవారం 14 జూలై 2020
National - Jun 14, 2020 , 19:11:15

‘ఈ సైకోకు హత్యలు చేయడం హాబీ అట ’

‘ఈ సైకోకు హత్యలు చేయడం హాబీ అట ’

లక్నో: ‘జిహ్వకో రుచి అన్నట్లు’ .. ఈ సైకోకు హత్యలు చేయటం హాబీ అట. ఉత్తరప్రదేశ్‌లోని  ఈటా జిల్లా ధర్మపూర్‌ గ్రామానికి చెందిన రాథేశ్యామ్‌ గత ఫిబ్రవరిలో తన తమ్ముడి కుమారుడు సత్యేంద్రను, జూన్‌ 9న అతడి సోదరుడు ప్రశాంత్‌ను ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేశాడు.

జూన్‌ 11న రాథేశ్యామ్‌ తన సొంత అన్న విశ్వనాథ్‌ సింగ్‌నూ చంపేందుకు కత్తితో దాడి చేయగా అతడిని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టడంతో ‘సత్యేంద్రను, ప్రశాంత్‌ను హత్య చేశా... అన్నను హత్య చేయాలని ప్రయత్నించా..తనకు హత్యలు చేయడం హాబీ ’ అని నిందితుడు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

అప్పటికే రెండు హత్యల కేసును ఛేదించేందుకు తలమునకలైన పోలీసులకు నిందితుడే హత్యల గుట్టును విప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 


logo