బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 22:16:18

స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలో బందోబస్తు షురూ..

స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలో బందోబస్తు షురూ..

ఢిల్లీ: మరో నెలరోజుల్లో జరుగనున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పోలీసులు ఇప్పటి నుంచే బందోబస్తు చర్యలు ప్రారంభించారు. దేశ రాజదానిలో ఇళ్లలో  అద్దెకు ఉంటున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఇంటి యజమానుల సంఘం ప్రతినిధులతో సీనియర్‌ పోలీసు అధికారులు  సమావేశాలను నిర్వహిస్తున్నారు.

సాధారణ తనిఖీలతో పాటు స్వాతంత్ర్య వేడుకలను దృష్టిలో ఉంచుకొని  ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారిని కూడా తనిఖీలు చేస్తున్నామని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అద్దెకు ఉంటున్న వారు కూడా delhipolice.nic.in.లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు ఉన్నా, సంచరిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని  ఇంటి యజమానులను కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇళ్లను మార్చారని, కొత్తగా వచ్చిన వారి వివరాలను ఇంటి యజమానులు పూర్తిస్థాయిలో సేకరించి పోలీసులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. 

తాజావార్తలు


logo