శనివారం 04 జూలై 2020
National - Jun 02, 2020 , 14:55:53

వలస కూలీలకు ఉచిత కండోమ్‌ల పంపిణీ

వలస కూలీలకు ఉచిత కండోమ్‌ల పంపిణీ

పాట్నా : అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు వలస కూలీలకు బిహార్‌ ప్రభుత్వం కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తుంది. రాష్ర్టానికి చేరుకున్న వలస కార్మికులకు 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించేముందు అధికారులు వీరికి కండోమ్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.77 లక్షల మంది క్వారంటైన్‌ ముగించుకుని వెళ్లినట్లు తెలిపారు. బ్లాక్‌లు, జిల్లా కేంద్రాల్లో ఇంకా 5.30 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. అవాంఛిత గర్భధారణ విషయంలో ఇంటికి వెళ్లే ముందు వలస కూలీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ చర్య అని కోవిడ్‌-19తో ఎటువంటి సంబంధం లేదని స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ఫ్యామిలీ ప్లానింగ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆరోగ్య అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. ఈ నెల 15తో క్వారంటైన్‌ కేంద్రాల సేవలు ముగియనున్నాయి. అప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ర్టానికి చేరుకునే కూలీలు చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారు. 


logo