శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 10:57:55

ఏపీకి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తాం : కిషన్‌ రెడ్డి

ఏపీకి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తాం : కిషన్‌ రెడ్డి

ఢిల్లీ : విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీలో చనిపోయిన మృతులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను ముమ్మురం చేయాల్సిందిగా ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయంలో ఏపీ రాష్ర్టానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందించనున్నట్లు చెప్పారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పాలీవినైల్‌ క్లోరైడ్‌ గ్యాస్‌ లీకై 8 మంది మృత్యువాతపడగా వందకు పైగా వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. 


logo