గురువారం 16 జూలై 2020
National - Jun 19, 2020 , 12:47:00

చైనాకు వ్య‌తిరేకంగా స‌రిహ‌ద్దు గ్రామంలో నిర‌స‌న‌లు

చైనాకు వ్య‌తిరేకంగా స‌రిహ‌ద్దు గ్రామంలో నిర‌స‌న‌లు

డెహ్రాడూన్: ఇటీవ‌ల గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్-చైనా సైనికుల‌పై మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు చైనాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతున్నారు. కొంత‌మంది చైనా జాతీయ ప‌తాకాన్ని త‌గుల‌బెట్టి త‌మను నిర‌స‌న‌ను తెలియ‌జేస్తే, మ‌రికొంత మంది చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ఫొటోల‌ను త‌గుల‌బెట్టి త‌మ వ్య‌తిరేక‌త చాటుకుంటున్నారు. 

తాజాగా భార‌త్‌-టిబెట్ స‌రిహ‌ద్దుల్లోని ఓ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లు కూడా చైనాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రం చ‌మోలీ జిల్లాలోని నీతీ గ్రామానికి చెందిన‌ ప్ర‌జ‌లు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. గ‌ల్వాన్లో సైనికుల మ‌ర‌ణం చాలా బాధించింద‌ని వారు పేర్కొన్నారు. ఇక‌పై ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా భారత సేన‌ల‌కు స‌హ‌కారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని నీతీ గ్రామ‌స్తులు తెలిపారు.    


logo