మంగళవారం 19 జనవరి 2021
National - Dec 27, 2020 , 13:15:59

ప్ర‌ధాని మ‌న్ కీ బాత్‌.. త‌లెల చ‌ప్పుళ్ల‌తో రైతుల‌ నిర‌స‌న‌

ప్ర‌ధాని మ‌న్ కీ బాత్‌.. త‌లెల చ‌ప్పుళ్ల‌తో రైతుల‌ నిర‌స‌న‌

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా రైతులు త‌లెల శ‌బ్దాలు చేస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రేడియోలో ప్ర‌ధాని ప్ర‌సంగం కొన‌సాగినంతసేపు ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా స‌హా ప‌లు రాష్ట్రాల్లో రైతులు తలెల చ‌ప్పుళ్లు చేశారు. ప్ర‌ధాని న‌రంద్ర‌మోదీకీ, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. న‌ల్ల‌చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేవ‌ర‌కు త‌మ ఆందోళ‌న విర‌మించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. 

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు త‌మ‌కు న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ రైతులు గ‌త నెల రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. ఢిల్లీ శివార్ల‌లో రోడ్ల‌పై బైఠాయించి శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మ‌న్ కీ బాత్ సంద‌ర్భంగా తలెల చ‌ప్పుళ్లు చేస్తూ నిర‌స‌న వ్య‌క్తంచేయాల‌ని గ‌త ఆదివార‌మే నిర్ణ‌యించుకున్నారు. ఆ మేర‌కు ఇవాళ ప్ర‌ధాని మ‌న్ కీ బాత్ ప్ర‌సంగం మొద‌లు కాగానే తలెలు వాయిస్తూ, నినాదాలు చేస్తూ నిర‌స‌న తెలియ‌జేశారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.