సోమవారం 18 జనవరి 2021
National - Jan 13, 2021 , 15:02:16

మూడు సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

మూడు సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

న్యూఢిల్లీ: మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు సంబంధించిన కాపీల‌ను రైతులు త‌గ‌ల‌బెట్టారు. ఢిల్లీలోని సింఘ్రూ బోర్డ‌ర్ వ‌ద్ద దీక్ష చేస్తున్న రైతులు ఆ కాపీల‌కు నిప్పుపెట్టారు.  వివాదాస్ప‌ద చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు.  ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. లోహ్రీ పండుగ రోజున రైతులు వ్య‌వ‌సాయ కాపీల‌కు మంట పెట్టారు. ఈ రోజునే భోగి మంట‌లు వేసే సాంప్ర‌దాయం ఉన్న‌ది.  అయితే రైతు చ‌ట్టాల కాపీల‌ను త‌గుల‌బెట్టి .. లోహ్రీ వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకోనున్న‌ట్లు మ‌న్‌జీత్ సింగ్ రాయి తెలిపారు.