26న ట్రాక్టర్ పరేడ్

- డిమాండ్లు నెరవేర్చకపోతే ఢిల్లీలోకి ట్రాక్టర్లతో ర్యాలీ
- కేంద్రానికి రైతు సంఘాల హెచ్చరిక
- కొత్త చట్టాలపై రేపు మళ్లీ చర్చలు
న్యూఢిల్లీ, జనవరి 2: నూతన వ్యవసాయ చట్టాలపై ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలు జరుపనున్న నేపథ్యంలో రైతు సంఘాల నేతలు కేంద్రానికి అల్టిమేటం జారీచేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోకి ట్రాక్టర్ పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. నిర్ణయాత్మక పోరుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రైతు నాయకుడు దర్శన్పాల్ సింగ్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కిసాన్ పరేడ్ పేరుతో తాము ప్రదర్శన నిర్వహిస్తామని, రిపబ్లిక్ పరేడ్ ముగిసిన తర్వాత దీనిని చేపడుతామని చెప్పారు. పరేడ్ మార్గం, సమయాన్ని తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. ఈ నెల 6వ తేదీన నిర్వహించబోయే ట్రాక్టర్ మార్చ్ యథాతథంగా జరుగుతుందని, ‘జనవరి 26 ట్రాక్టర్ పరేడ్'కు ఇది రిహార్సల్ వంటిదని పేర్కొన్నారు. నూతన చట్టాల రద్దుపై ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో రావాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, అయితే చట్టాల రద్దు తప్ప తమకు ప్రత్యామ్నాయమేదీ లేదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టంచేసింది.
చట్టాలు రద్దు చేయాలని రైతు ఆత్మహత్య
వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూపీ రైతు సర్దార్ కశ్మీర్ సింగ్ (75) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘాజీపూర్‌లో కొనసాగుతున్న నిరసనోద్యమంలో పాల్గొంటున్న ఆయన అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, రైతుల డిమాండ్లలో 50 శాతం అంగీకరించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవమని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్రయాదవ్ మండిపడ్డారు. ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి 50 మంది రైతులు అమరులయ్యారని రైతు నేత గుర్నామ్‌సింగ్ చెప్పారు.
తాజావార్తలు
- భారత్‌కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్‌గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్‌పథ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల