బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 15:47:54

కతువాలో టెక్స్‌టైల్‌ కార్మికుల ఆందోళన హింసాత్మకం

కతువాలో టెక్స్‌టైల్‌ కార్మికుల ఆందోళన హింసాత్మకం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కతువా జిల్లాలో కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారింది. కుతువా జిల్లాలోని చీనాబ్‌ టెక్స్‌టైల్‌ మిల్స్‌లో పనిచేసే కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. టెక్స్‌టైల్‌ మిల్స్‌ యాజమాన్యం తమ వేతనాల్లో కోతలు విధిస్తున్నదని, దాంతో తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని, తమకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని కార్మికులు పట్టుబట్టారు. అయితే, లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుతిరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన పలువురు కార్మికులను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు.


logo