సోమవారం 18 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:10:20

ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి పౌరుడి బాధ్య‌త‌: ప‌్ర‌ధాని మోదీ

ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి పౌరుడి బాధ్య‌త‌: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: ప‌్ర‌కృతిని ప‌రిర‌క్షించుకోవ‌డం ప్ర‌తి పౌరుడి బాధ్య‌త అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇవాళ రేడియోలో ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ప్ర‌కృతిని కాపాడుకోవ‌డాన్ని దేశంలోని ప్ర‌తి పౌరుడు బాధ్య‌త‌గా తీసుకోవాల‌న్నారు. దేశ వారసత్వ చరిత్రను ప్రతిబింబించే ప్రాచీన విగ్రహాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.

వారణాశిలో చోరీకి గురైన అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహాన్ని తిరిగి రప్పిస్తున్నామని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్రాచీన వారసత్వ సంపదతో పాటు ప్రకృతిని కాపాడుకోవడాన్ని ప్రతి భారతీయుడు తన బాధ్యతగా గుర్తించాలని సూచించారు. న్యూజీలాండ్‌లో కొత్తగా ఆ దేశ పార్లమెంట్‌కు ఎంపీగా ఎన్నికైన డాక్టర్ గౌరవ్ శర్మ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారని, అది మ‌న‌కు గర్వకారణమని అన్నారు. సోమవారం గురునానక్ జయంతిని జరుపుకోనున్నామని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని చెప్పారు.

2001లో గుజరాత్‌లోని కఛ్‌లో సంభవించిన భూకంపానికి ప్రాచీన గురుద్వారా ద్వంసమైందని, దాన్ని పునరుద్ధరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్ర‌ధాని పేర్కొన్నారు. గురునానక్ స్వయంగా ఈ గురుద్వారాలో సేద తీరినట్లు చరిత్ర చెబుతోందని తెలిపారు. గురునానక్ ఆశీర్వాద బలంతో కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రాజెక్టును పూర్తిచేశామని చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.