శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 13:59:31

బెంగ‌ళూరులో వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు

బెంగ‌ళూరులో వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరులో వ్య‌భిచార ముఠా గుట్టు ర‌ట్ట‌య్యింది. న‌గ‌రంలోని య‌శ్వంత్‌పూర్ ఏరియాలోగ‌ల ఓ గెస్ట్‌హౌస్‌లో వ్య‌భిచారం జ‌రుగుతున్న‌ద‌న్న స‌మాచారం అందుకున్న సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. ఆ గెస్ట్‌హౌస్‌పై రైడ్ చేశారు. వ్య‌భిచార గృహం నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి చెర‌లో ఉన్న ఐదుగురు యువ‌తుల‌ను ర‌క్షించి రెస్క్యూ హోమ్‌కు త‌ర‌లించారు. 

బెంగ‌ళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ రైడింగ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కాగా, గ‌త‌వారం కూడా సీసీబీ పోలీసులు ఓ వ్య‌భిచార ముఠాగుట్టును ర‌ట్టు చేశారు. ఆ ముఠా చెర‌లో ఉన్న‌ 27 మంది మ‌హిళ‌ల‌ను కాపాడి బెంగ‌ళూరులోని రెస్క్యూ హోమ్‌కు త‌ర‌లించారు.           

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo