శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 10:36:43

విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం.. 23కి చేరిన మృతుల సంఖ్య‌

విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం..  23కి చేరిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి సంఖ్య 23కి చేరుకున్న‌ది.  ఇవాళ ఉద‌యం డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అధికారులు ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానం నుంచి డిజిట‌ల్ ఫ్ల‌యిట్ డేటా రికార్డ‌ర్‌ను తీసారు.  కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్‌(సీవీఆర్‌)ను తీసేందుకు ఫ్లోర్‌బోర్డ్‌ను క‌ట్ చేయాల్సి వ‌చ్చింది.  క‌రిపుర్ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలో 23 మంది మృతిచెంద‌గా, సుమారు 174 మంది గాయ‌ప‌డ్డారు.  గాయ‌ప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రుల్లో చేర్పించారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో(ఏఏఐబీ) అధికారులు డిజిట‌ల్ ఫ్ల‌యిట్ రికార్డ‌ర్‌, కాక్‌పిట్ వాయిస్ రికార్డ‌ర్‌ను ఢిల్లీ తీసుకువెళ్ల‌నున్నారు.  

విమాన ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన‌ట్లు విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి ముర‌ళీధ‌ర‌న్ తెలిపారు. కాలిక‌ట్ ఎయిర్‌పోర్ట్‌ను విజిట్ చేశాన‌ని, ఎయిర్ ఇండియా అధికారుల ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స‌మాచారం ఇచ్చార‌ని, ప్ర‌మాదానికి దారితీసిన కార‌ణాల‌పై దర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. విమానం రెండు ముక్క‌లైంద‌ని, రెస్క్యూ ఆప‌రేష‌న్ స‌మయంలో విమానంలో కొంత భాగాన్ని ధ్వంసం చేయాల్సి వ‌చ్చింద‌న్నారు.  


logo