శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:58:57

యూపీ సీఎం యోగికి ప్రియాంక గాంధీ లేఖ‌

యూపీ సీఎం యోగికి ప్రియాంక గాంధీ లేఖ‌

ల‌క్నో : రాష్ర్టంలో క్షీణిస్తున్న శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌కు లేఖ రాశారు. కిడ్నాప్ సంఘటనలు పెరుగుతున్న‌ నేపథ్యంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్య‌త పోలీసులు, ప‌రిపాల‌న యంత్రాంగంపై ఉంద‌న్నారు. లేఖ‌లో కిడ్నాప్‌కు గురైన వ్యాపారి విక్రం త్యాగి అంశాన్ని కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌స్తావించారు. ఘ‌జియాబాద్‌కు చెందిన వ్యాపార‌వేత్త విక్రం త్యాగి దాదాపు ఒక నెల నుండి క‌నిపించ‌కుండా పోయారు. అత‌న్ని కిడ్నాప్ చేసిన‌ట్లుగా త్యాగి కుంటుంబం అనుమానిస్తున్న‌ట్లు ప్రియాంక గాంధీ తెలిపారు.

ఈ అంశంలో ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసినా అటు పోలీసులుగానీ ఇటు పరిపాలన యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. త‌మ పార్టీ ప్ర‌తినిధి బృందం బాధిత కుటుంబాన్ని క‌లిసిన‌ప్పుడు వారు చాలా ఆందోళ‌న వ్య‌క్తం చేశారంది. ఉత్తరప్రదేశ్‌లో కిడ్నాప్ ఘ‌ట‌న‌లు వేగంగా పెరుగుతున్నాయంది. శాంతిభద్రతలు క్షీణిస్తున్న ఈ సమయంలో పోలీసులు, ప‌రిపాల‌న యాంత్రంగా స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల బాధ‌లు ప‌రిష్క‌రించేందుకు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆమె కోరారు. 

తాజావార్తలు


logo