బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 15:28:00

ఈ 11 సూచనలు పాటిస్తేనే బాగుపడతాం

 ఈ 11 సూచనలు పాటిస్తేనే బాగుపడతాం


లక్నో: కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తాను చేస్తున్న 11 సూచనలను పాటిస్తే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బాగుపడుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్తున్నారు. ఈ మేరకు బుధవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఆమె ఒక లేఖ రాశారు. గృహరుణాలపై వడ్డీ కోరవద్దని, రైతులకు నాలుగునెలలపాటు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని, రైతులు పండించే పంటలను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమె సూచించారు. అలాగే, రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశమ్రలకు కూడా ఉపశమనం  పొందేలా చూడాలన్నారు. నేత, కార్పెట్‌ తయారీదారుల సమస్యలను కూడా ప్రస్తావించిన ప్రియాంక.. వారికి ఆర్థిక ఉపశమనం కలించేలా రుణమాఫీ డిమాండ్‌ చేశారు. 


logo