బుధవారం 27 మే 2020
National - May 16, 2020 , 15:07:12

ఔరయ ఘటనపై ప్రియాంక గాంధీ ఫైర్‌

ఔరయ ఘటనపై ప్రియాంక గాంధీ ఫైర్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌ ద్వారా ప్రియాంక స్పందిస్తూ... మరోసారి హృదయం ద్రవీంచుకుపోయిందన్నారు. వలస కూలీల దుస్థితిపై మరొక్కసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నారు. అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్నారు. వలస కూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్నారు. కూలీల తరలింపునకు రాష్ట్రం పరిధిలో బస్సులను ఎందుకు నడపడం లేదని  ప్రశ్నించారు. ప్రస్తుత దుర్భర పరిస్థితులను ప్రభుత్వాలు అసలేం చూడకుండా అయినా ఉండాలి.. లేదా ప్రతిదాన్ని విస్మరించుకుంటూ వెళ్లడమైన కావాలన్నారు. ప్రభుత్వం పని కేవలం అలంకారప్రాయానికేనా పరిమితమా అని ఆమె పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది సంగతి తెలిసిందే. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న ట్రక్కు శనివారం తెల్లవారుజామున ఔరయ వద్ద మరో ట్రక్కును ఢీకొట్టింది. ఇందులో బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాలకు చెందిన వలస కూలీలు ఉన్నారు. 


logo