బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 19:36:18

తండ్రితో దిగిన ఆఖరి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేసిన ప్రియాంకాగాంధీ

తండ్రితో దిగిన ఆఖరి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేసిన ప్రియాంకాగాంధీ

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి నేపథ్యంలో ఆయన కుమార్తె ప్రియాంకాగాంధీ తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. తన తండ్రితో కలిసి దిగిన ఆఖరి ఫొటోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటో దిగినప్పుడు ప్రియాంకా గాంధీ వయసు 19 సంవత్సారాలట. ట్విట్టర్‌లో ఫొటోను పోస్ట్‌ చేసిన ప్రియాంక.. ‘లాస్ట్‌ ఫొటో విత్‌ ఫాదర్‌’అని దానికి క్యాప్షన్‌ కూడా పెట్టారు. అదేవిధంగా ఒక మెసేజ్‌ కూడా రాశారు. ‘నీపై దయచూపని వారిపట్ల కూడా నీవు దయ కలిగి ఉండు. నీకు అన్యాయం జరిగినా నువ్వు న్యాయంగా ఉండు. చిమ్మ చీకట్లోనైనా నీ నడకన కొనసాగించు’ అనే పాఠాలు తాను తన తండ్రి నుంచి పొందిన బహుమానాలని ఆ మెసేజ్‌లో ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు.


logo