శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 01:47:30

రవిదాస్‌ బోధనలు తక్షణావసరం

రవిదాస్‌ బోధనలు తక్షణావసరం
  • ప్రియాంకాగాంధీ వెల్లడి వారణాసి ఆలయంలో పూజలు

లక్నో: పద్నాలుగో శతాబ్ది సాధువు, కవి గురు రవిదాస్‌.. మత, కుల వివక్ష లేని సమాజం కోసం కలలు కన్నారని, దాని సాకారానికి ప్ర తి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కోరారు. రవిదాస్‌ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రవిదాస్‌ బోధనలను ప్రజల్లో కి తీసుకెళ్లాలని సూచించారు. రామ్‌, రహీం ఒక్కరేనని రవిదాస్‌ బోధించారని.. హింస, విద్వేషం నెలకొన్న ప్రస్తుత సమాజంలో ఆయన బోధనలు తక్షణావసరమన్నారు. ఆయన బోధనల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. సద్గురు రవిదా స్‌ జన్మస్థలంలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంతకు ముందు ఆమె గురు రవిదాస్‌ జన్మస్థాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సహపంక్తి భోజనం చేశారు. 


ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. గురు రవిదాస్‌ తన బోధనల ద్వారా ప్రేమ, ఐక్యతాభావాన్ని వ్యాప్తిచేశారని ఉపరాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. సమాజంలో సానుకూల మార్పునకు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని ఆయన ప్రబోధించారని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 


logo