గురువారం 26 నవంబర్ 2020
National - Sep 29, 2020 , 11:51:46

యూపీ సీఎం యోగిపై ప్రియాంక గాంధీ ధ్వ‌జం

యూపీ సీఎం యోగిపై ప్రియాంక గాంధీ ధ్వ‌జం

న్యూఢిల్లీ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌పై కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ ధ్వ‌జ‌మెత్తారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని మండిప‌డ్డారు. రోజురోజుకు మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైతుంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హ‌త్రాస్‌కు చెందిన ద‌ళిత యువ‌తిపై సామూహిక అత్యాచారం చేసిన న‌లుగురు దుండగుల‌కు క‌ఠిన శిక్ష విధించాల‌ని ప్రియాంక డిమాండ్ చేశారు. బాధిత యువ‌తి గ‌త‌ రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి ఓడింద‌ని ఆమె పేర్కొన్నారు. క్రిమిన‌ల్స్ బ‌హిరంగ నేరాల‌కు పాల్ప‌డుతున్న ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్రియాంక కోపోద్రిక్తుల‌య్యారు. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్రియాంక ప్ర‌శ్నించారు.